
రజనీ ‘జైలర్ 2’లో మీరు ఊహించని హీరో !? ఆ ఒక్క పేరు… హైప్ ఆకాశమే హద్దు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మాస్ రికార్డ్స్ సృష్టించిన చిత్రం‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌లా దూసుకెళ్లింది. ఆ విజయం వెంటనే మొదలైన‘జైలర్ 2’ ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.
పార్ట్ 2… ఈసారి స్కేల్ డబుల్!
‘జైలర్’ తొలి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి దిగ్గజాలు అతిథి పాత్రల్లో కనిపించి థియేటర్లను ఊపేశారు. అదే ఫార్ములాను మరింత పెద్ద స్థాయిలో పార్ట్ 2కి అప్లై చేస్తున్నారన్నది తాజా టాక్.
మిథున్ చక్రవర్తి కామెంట్స్‌తో బాంబ్ పేలింది!
సీనియర్ నటుడుమిథున్ చక్రవర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. ఆయన మాటల్లోనే — ఈ సీక్వెల్‌లోషారుక్ ఖాన్,మోహన్‌లాల్,రమ్యకృష్ణ,శివరాజ్‌కుమార్ కీలక అతిథి పాత్రల్లో కనిపించనున్నారట! ముఖ్యంగాషారుక్ ఖాన్ పేరు బయటకు రావడంతో… ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. బాలీవుడ్ కింగ్ – కోలీవుడ్ సూపర్‌స్టార్ కలయిక అంటే హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
శివరాజ్‌కుమార్ రోల్‌కు స్పెషల్ వెయిట్!
ఇప్పటికే శివరాజ్‌కుమార్ కూడా తన పాత్రపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. పార్ట్ 1 ఎక్కడ ముగిసిందో… అక్కడి నుంచే పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఈసారి తన పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని, ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా భాగం జనవరిలో పూర్తి కానుందట.
‘జైలర్’ స్టైల్… కానీ నెక్ట్స్ లెవల్!
రజనీకాంత్‌ను పవర్‌ఫుల్‌గా చూపించిన విధానం, గూస్‌బంప్స్ తెప్పించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ — ఇవన్నీ ‘జైలర్’కి ప్లస్ అయ్యాయి. అదే స్టైల్‌నుమరింత అప్‌గ్రేడ్ చేసి, పార్ట్ 2నిగ్రాండ్ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల టాక్.
రిలీజ్ డేట్ ఫిక్స్?
ప్లాన్ ప్రకారం2026 జూన్ 12న ‘జైలర్ 2’ను విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లతో సినిమాను మార్కెట్ చేయబోతున్నారని సమాచారం.
రజనీకాంత్ + షారుక్ ఖాన్ నిజమైతే… ఇది సినిమా కాదు, ఇండియన్ బాక్సాఫీస్ పండగ!
