సినిమా వార్తలు

సంక్రాంతి సినిమాలంటే USA లో సునామీ… కానీ ఈసారి నిశ్శబ్దం ఎందుకని?

సంక్రాంతి సినిమాలంటే తెలుగువాళ్లందరికీ ఓ రేంజ్ క్రేజ్…ఇక్కడే కాదు…అమెరికాలో థియేటర్లు నిండిపోవాలి… కానీ ఈసారి సీన్ రివర్స్! ఇది ట్రేడ్ ని షాక్ ఇస్తోంది.

సాధారణంగా సంక్రాంతి అంటే తెలుగు సినిమాలకు పండగే కాదు… బాక్సాఫీస్ పండుగ. స్టార్ హీరో సినిమా అంటే యుఎస్‌లో అడ్వాన్స్ బుక్కింగ్స్ ఓపెన్ అవ్వగానే లక్షల డాలర్లు కదిలిపోతాయి. అలాంటిది సంక్రాంతి 2026కి వస్తున్న భారీ సినిమాలే… యుఎస్ మార్కెట్‌లో మౌనంగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

USAలో ఎక్కడా సంక్రాంతి హైప్?

సంక్రాంతి 2026కి రెండు పెద్ద సినిమాలతో పాటు కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కానీ అందరి దృష్టిని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఒక్కటే — యుఎస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ అంచనాలకు చాలా తక్కువగా ఉండటం.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’… క్రేజ్ ఉంది కానీ నంబర్లు షాక్ ఇస్తున్నాయా?

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ యుఎస్‌లో అడ్వాన్స్ బుక్కింగ్స్ కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు $200K మార్క్ కూడా దాటలేదు. ప్రీమియర్ అడ్వాన్స్: సుమారు $180K . పోస్ట్-బాహుబలి కాలంలో ఇది ప్రభాస్ సినిమాకు బలహీనమైన ఓపెనింగ్గా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బుక్కింగ్స్‌లో స్ట్రాంగ్ జంప్ రాకపోతే… రిలీజ్ ముందు అంచనాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’… స్టార్ కాంబో అయినా స్టార్ట్ స్లో?

ఇక మరోవైపు అనిల్ రావిపూడి – చిరంజీవి – వెంకటేష్ – నయనతార లాంటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్తో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదు.
యుఎస్ అడ్వాన్స్ బుక్కింగ్స్: సుమారు $40K మాత్రమే.

ఈ స్థాయి స్టార్ పవర్‌కి ఇది ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తున్న నెంబర్. సాధారణంగా ఈ కాంబోకి యుఎస్‌లో ఓపెనింగ్ ట్రెండ్ వేరేలా ఉండాలి… కానీ ఈసారి మాత్రం హైప్ నెమ్మదిగా కదులుతోంది.

మొత్తం మీద… సంక్రాంతి బిగ్గీస్‌కు అలర్ట్ టైమ్?

మొత్తంగా చూస్తే సంక్రాంతి 2026 బిగ్ మూవీస్ యుఎస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ విషయంలో అండర్‌వెల్మింగ్ స్టార్ట్ తీసుకున్నాయి. ఇప్పటి నుంచి ట్రైలర్స్, ప్రమోషన్స్ , మౌత్ టాక్ ఈ మూడు కలిసి పెద్ద పుష్ ఇవ్వకపోతే రిలీజ్ ముందు నంబర్లు స్ట్రాంగ్‌గా మారటం కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

సంక్రాంతి పండగ ముందు నిజమైన బాక్సాఫీస్ పండగ జరుగుతుందా… లేదా యుఎస్ మార్కెట్ ఈసారి కొత్త సిగ్నల్ ఇస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిందే.

Similar Posts