
ఆన్‌లైన్ మోసగాడి వలలో ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడు! అసలు ఏం జరిగిందంటే…?
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు హద్దులు దాటిపోతున్నాయి. సామాన్యులే కాదు, స్టార్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ… వారి మంచి మనసునే ఆయుధంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. సోషల్ మీడియాలో కనిపించే ఎమోషనల్ పోస్టులు, కన్నీటి కథలు… ఇవన్నీ నిజమేనా? అనే అనుమానం కూడా రాకుండా చేసేలా స్కెచ్‌లు వేస్తున్నారు. అలాంటి ఓ ఆన్‌లైన్ మోసంలో తాజాగా చిక్కుకున్నారు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ నటుడు జి.వి. ప్రకాష్ కుమార్. అసలు ఏం జరిగింది? ఎలా మోసపోయారు? ఎవరు ఆ వ్యక్తి?
బిజీ స్టార్… సాఫ్ట్ హార్ట్ టార్గెట్!
నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జి.వి. ప్రకాష్‌కు టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో భారీ డిమాండ్ ఉంది. ‘అమరన్’ వంటి హిట్ సినిమాలకు హృద్యమైన సంగీతం అందించిన ఆయన… ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు టాప్ డైరెక్టర్లకు ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా… అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంలో ముందుంటారు ప్రకాష్. అదే ఆయన బలహీనతగా మారింది.
‘మామ్ లిటిల్ కింగ్’… ఎమోషనల్ డ్రామాతో స్కెచ్!
‘మామ్ లిటిల్ కింగ్’ అనే ఎక్స్ (Twitter) ఖాతా నుంచి ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. “మా అమ్మ చనిపోయింది… నాన్న లేరు… చెల్లి మాత్రమే ఉంది… అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేవు… దయచేసి సాయం చేయండి” అంటూ హృదయాన్ని కదిలించేలా పోస్ట్ పెట్టారు. తమ తల్లి ఫోటో అంటూ ఒక చిత్రాన్ని కూడా జత చేశారు. ఆ కథ నిజమేనని నమ్మిన జి.వి. ప్రకాష్… ఎలాంటి అనుమానం లేకుండా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
రూ.20 వేలు పంపిన ప్రకాష్… బయటపడిన నిజం!
ఆ వ్యక్తి ఇచ్చిన GPay నంబర్‌కు రూ.20,000 జి.వి. ప్రకాష్ పంపించారు. కానీ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. పోస్ట్‌లో వాడిన ఫోటో… 2002లో ఆన్‌లైన్‌లో ఉన్న పాత ఫోటో అని తేలింది. చెప్పిన కథ అంతా అబద్ధం అని స్పష్టమైంది. అంతా ప్లాన్ చేసిన ఆన్‌లైన్ మోసం అని తెలిసింది.
మోసపోయినా… గెలిచింది మంచి మనసే!
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… “మోసపోయినా ఆయన చేసినది తప్పు కాదు” . “అనుమానం లేకుండా సాయం చేయడం గొప్ప మనసు”. “ఇలాంటి సెలబ్రిటీలే నిజమైన హీరోలు” అంటూ అభిమానులు జి.వి. ప్రకాష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎవరు? ఏంటి? అన్నది చూడకుండా… కష్టంలో ఉన్నారని నమ్మి సహాయం చేయడం… ఆయన మనసుకు నిదర్శనమని అంటున్నారు.
ఆన్‌లైన్ మోసాలపై హెచ్చరిక!
ఈ ఘటన మరోసారి ఒక విషయం స్పష్టం చేసింది — ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఎక్కువైంది. ఎమోషన్‌ను ఆయుధంగా మార్చుకుంటున్నారు. కాబట్టి… మంచి మనసు ఉండాలి, కానీ జాగ్రత్త కూడా అంతే అవసరం. మోసగాళ్లు మాయలో పడిపోయినా… జి.వి. ప్రకాష్ గెలిచింది మాత్రం మనసులే!
