సినీ ఇండస్ట్రీలో హీరోలపై ఇలా బహిరంగంగా మాటల దాడి చేయడం చాలా అరుదు. కానీ తమన్నా భాటియా మాత్రం ఎలాంటి భయం లేకుండా, కెమెరా ముందే ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. కెరీర్ మొదటి రోజుల్లోనే, ఒక సౌత్ సూపర్‌స్టార్ తనతో అసహజంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. పేరును మాత్రం చెప్పలేదు… కానీ ఇచ్చిన హింట్స్‌తో ఎవరో ఊహించే స్థాయికి అభిమానులు చేరిపోయారు!

“ఆ రోజు సెట్‌లో ఆయన ప్రవర్తన నన్ను చాలా అసౌకర్యంగా అనిపించింది… వెంటనే నేను ఆ సినిమా చేయనని చెప్పేశా” అంటూ తమన్నా షాకింగ్‌గా గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఆ స్టార్ తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడట.

ఇటీవలే బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తమన్నా, ఇప్పుడు జిమ్‌లో చెమటలు కక్కుతూ, మరింత గ్లామరస్‌గా మారి, కొత్త సినిమాలపై దృష్టి పెట్టింది.

తమన్నా వేసిన ఈ మిస్టరీ బాంబ్‌తో సోషల్ మీడియాలో ఊహాగానాలు దూసుకెళ్తున్నాయి – “ఆ హీరో ఎవరు?” అన్న ప్రశ్నతో నెటిజన్లు డిస్కషన్స్ ప్రారంభించేసారు!

You may also like
Latest Posts from