టాలీవుడ్ గ్లామర్ క్వీన్, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు, థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లిపోవాల్సిందే. అయితే, ఈ ‘జబర్దస్త్’ బ్యూటీపై ఉన్న అభిమానం ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. గతంలో తమిళనాడులో నటి ఖుష్బూకు ఫ్యాన్స్ గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో అనసూయకు కూడా ఆలయం నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్త టాలీవుడ్‌లో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఒక ‘పూజారి’ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఖుష్బూ తర్వాత మన ‘అనసూయ’నే!

ఒకప్పుడు హీరోయిన్ల మీద పిచ్చితో గుళ్ళు కట్టిన రోజులు మళ్ళీ వచ్చేశాయి. తాజా ఇంటర్వ్యూలో ఒక పూజారి …అనసూయ ఆలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ గారికి గుడి కట్టినట్లుగానే, అనసూయ గారికి కూడా గుడి కట్టాలని చాలా మంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

భవిష్యత్తులో అందరం కలిసి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఆలయ నిర్మాణం తప్పకుండా ఉంటుందని హింట్ ఇచ్చారు.

అయితే, ఈ ఆలయ నిర్మాణం అనేది పూర్తిగా అనసూయ భరద్వాజ్ అనుమతి మీద ఆధారపడి ఉంటుందని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులు మొదలుపెడతామని స్పష్టం చేశారు.

పూజారిగా ఆయనే ఉంటారా?

ఈ గుడి కడితే పూజారిగా ఎవరు ఉంటారు? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పూజారి అంటే ఏదో మంత్రాలు చదవడం కాదు, ఒక గులాబీ పువ్వు పెట్టినా భక్తితో, ప్రేమతో పూజ చేసినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని, ఒకవేళ అంతా కుదిరితే ఖుష్బూ గారికి కట్టినట్లుగానే సేమ్ టు సేమ్ ఆలయం నిర్మిస్తామని క్లారిటీ ఇచ్చారు.

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లకు గుడి కట్టడం అనేది కొత్త కాదు కానీ, ఒక యాంకర్ కోసం ఇలాంటి ప్లాన్ జరగడం నిజంగా విశేషమే. మరి అనసూయ దీనికి పర్మిషన్ ఇస్తుందా? లేదా ఇది కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ స్టంటా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా ‘అనసూయ’ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదుగా! ఈ ఆలయ నిర్మాణంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి!

#Anasuya Bharadwaj, #Anasuya Temple, #anchor anasuya, #Murali Sharma

By admin