ఆది సాయికుమార్‌ దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత హీరోగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిత్రం ‘షణ్ముఖ‌’. అలాగే ఉయ్యాల – జంపాల అవికా గోర్ హీరోయిన్ గా చేసింది. వీళ్లిద్దరి క‌ల‌యిక‌లో ఓ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? ఆది సాయికుమార్‌ కు ఇప్పటికైనా హిట్‌ పడిందా?

కథేంటి

ఆరు ముఖాల‌తో పుట్టిన త‌న బిడ్డ‌ని తిరిగి యధా స్దితికి ఏక ముఖంతో మార్చాల‌నుకుంటాడు విరాండ (చిరాగ్ జానీ). అందుకోసం వైద్యులను కాకుండా క్షుద్ర శ‌క్తుల్ని ఆశ్ర‌యిస్తాడు. ఆ క్షుద్ర శక్తులు ఆవురావురుమని ఉన్నాయో ఏమో వివిధ రాశుల్లో పుట్టిన ఆరుగురు యువ‌తుల ర‌క్త‌త‌ర్ప‌ణం అడుగుతాయి. దాంతో అదెంత పని అన్నట్లు విరాండ ఒకొక్క‌రిగా ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అడ‌వికి తీసుకొస్తారు.

ఈ క్రమంలో ఎక్కెడెక్కడి అమ్మాయిలు మాయమైపోతూంటారు. అలాగే ఆ అమ్మాయిల బోయ్ ప్రెండ్స్ కూడా చిత్రమైన పరిస్దితుల్లో చంపబడుతూంటారు. సారా (అవికా గోర్)ఓ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ ..ఈ కేసు వెనక ఉన్న రహస్యాలను ఛేథించే ప్రయత్నం చేస్తూంటుంది. కొంతదూరం వెళ్లాక ఆమె ఇన్విస్టిగేషన్ లో కార్తీక్ (ఆది సాయి కుమార్) జాయిన్ అవుతాడు. సారాపై ఎస్సై కార్తీక్ (ఆది సాయికుమార్‌) మ‌న‌సు ప‌డతాడు. ఈ లోగా ఆ క్షుద్ర శక్తులు సారా (అవికా గోర్‌) ని కూడా కోరుకుంటాయి.

మ‌రి కార్తీక్‌ని దాటి క్షుద్ర‌శ‌క్తులు సారాని తీసుకెళ్లాయా?వరుస‌గా జ‌రిగిన యువ‌తుల కిడ్నాప్ కేసుల్ని కార్తీక్ ఎలా ఛేదించాడు? అనేది చిత్ర కథ.

ఎనాలసిస్

మాయ‌లు మంత్రాలతో రూజిన ఈ డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లైన్ గా బాగానే ఉంది. అలాగే ఎత్తుగ‌డ ఇంట్రస్ట్ ని రేకెత్తించేలా ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాతే సినిమా ప‌ట్టు త‌ప్పింది. ఆరు తలలు ఉన్న వ్యక్తి, అతని బ్యాక్‌స్టోరీ, క్రైమ్ యాంగిల్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లో బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంట్రవెల్ ట్విస్ట్ , కీలక టైమ్ లో ముడివిప్పటం దాకా బాగానే ఉన్నాయి. అయితే అవి మాత్రమే బాగున్నాయి. అనుకున్న స్దాయిలో డ్రామా క్రియేట్ కాలేదు.

క్లీంకారగా వచ్చే సారా ఎపిసోడ్‌ ప్రి క్లైమాక్స్ స‌న్నివేశాలతోపాటు, క్లైమాక్స్‌ మెప్పిస్తుంది. మిగతా కథనం అంతా బోర్ కొట్టించేసారు. సినిమా యొక్క అతిపెద్ద లోపం స్క్రీన్ ప్లే. దర్శకుడు షణ్ముగం కథను సంక్లిష్టత చేయటం కోసం ఎంచుకున్న సబ్‌ప్లాట్‌లు, చూసేవారిని తప్పుదారి పట్టించే సన్నివేశాలతో జోడించటం వర్కవుట్ కాలేదు. అవన్ని ఇంట్రస్టింగ్ గా కథనాన్ని నడపటానికి బదులుగా, గందరగోళానికి గురిచేసాయి. మొదలు, చివ‌రి భాగం ఆక‌ట్టుకునేలా ఉన్నా, మ‌ధ్య‌భాగంలో బ‌లం లేక సినిమా విసిగిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే…

ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ర‌వి బ‌స్రూర్ సంగీతం తేలిపోయింది. టెన్షన్ ని, ఎక్సైట్మైంట్ ని కావాల్సినంతగా తీసుకురాలేకపోయింది స్కోర్. ఆర్‌.ఆర్‌.విష్ణు కెమెరా వర్క్ బాగుంది. ఇలాంటి సినిమాకు అవసరమైన మూడ్ ని ఫెరఫెక్ట్ గా పట్టుకుంది. డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ లో ఉండాల్సింది. చాలా చోట్ల స్లో అయ్యినట్లు, డ్రాగ్ అయ్యినట్లు అనిపిచింది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

నటీనటుల్లో ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో ఫెరఫెక్ట్. ఇక అవిక గోర్ గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్‌ ని అందించింది. చిరాగ్ జానీ, ఆదిత్య ఓం, పండు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకే పరిమితమయ్యారు.

చూడచ్చా
జస్ ఓకే అనిపించే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చచ్చు! మిగతా వాళ్లకు సోసోగా అనిపిస్తుంది.

, ,
You may also like
Latest Posts from