రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ ఓటిటి ల విషయమై గట్టిగా స్పందించారు. ఇప్పుడు మన సినిమాలు థియేటర్లో రిలీజై నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలకు అమ్మేస్తున్న పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది థియేటర్ మార్కెట్‌ను బాగా దెబ్బతీస్తోందని, ప్రేక్షకులు కూల్ గా ఇంట్లోనే సినిమాలు చూడటం అలవాటుగా మలుచుకుంటున్నారని హెచ్చరించారు.
ఇక తన తాజా ప్రాజెక్ట్ సీతారే జమీన్ పర విషయంలో ఆమీర్ ఖాన్ ఓ రిస్కీ కానీ రివల్యూషనరీ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఈ సినిమాను జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
అయితే, దాని డిజిటల్ హక్కులు ఓ ప్రముఖ OTT సంస్థకు అమ్మకుండా, యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ మోడల్‌తో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం!
ఇది జరిగితే, సినిమా విడుదలైన ఎనిమిదో వారం నుంచి యూట్యూబ్‌లో ప్రేక్షకులు చెల్లించి చూసే అవకాశం కలుగుతుంది. దాదాపు ఓ కొత్త ట్రెండ్‌కు దారితీయబోయే ఈ నిర్ణయం ఇండియన్ సినిమా మార్కెట్‌లో ఆసక్తికర మార్పులకు నాంది కావొచ్చని అనిపిస్తోంది.
ఈ సినిమాను RS ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.