చిన్న చిన్న క్యారెక్టర్స్ తో  మొదలు పెట్టి.. ఎదుగుతూ.. వరుస సినిమాలు, ఫుల్ లెన్త్ రోల్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు పృథ్వి.  ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ  డైలాగ్ తో ఒక్కసారి ఫేమస్ అయిపోయారు పృథ్వీ. ఆ తరువాత కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. అయితే ఈమధ్య సినిమాలకు దూరం అయ్యాడు 30 ఇయర్స్ స్టార్.  పాలిటిక్స్ లో కి వెళ్లిన ఈ స్టార్ కమెడియన్స్ కు .. అక్కడ సెటిల్ అవుతున్న టైమ్ లోనే పెద్ద దెబ్బ తగిలింది. దాంతో అటు రాజీకియాలకు, ఇటు సినిమాలకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఓ వివాదంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అంతేకాదు ఆ వివాద ఫలితంగా ఆయన హాస్పటిల్ లో చేరారని తెలుస్తోంది.

హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నట్లు పృధ్వీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే హఠాత్తుగా ఇలాంటి పరిస్దితి రావటానికి గల కారణం గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదమే అని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

పృధ్వీరాజ్ గతంలో వైసీపీలో ఉంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసారు. లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అదీ తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృధ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తుచేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు.

పృధ్వీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గతంలో సినిమా వాళ్లను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తూ.. ఇలాంటి పనులు చేస్తే మరి చేయరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది.

పృధ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పినా.. పృధ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ.. ఎక్స్ వేదికగా #BoycotLaila పేరుతో టార్గెట్ చేసింది.

,
You may also like
Latest Posts from