ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై టాలీవుడ్ హీరో శివ బాలాజీ దంపతులు స్పందించారు. ఇందులో భాగంగా తమకి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే దాదాపుగా రూ.3 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ తాము మాత్రం తమ ఈ ఆఫర్స్ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
మధుమిత మాట్లాడుతూ…. ఫాలోవర్స్ ని తమ ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తామని దీంతో తమవల్ల తమ ఫాలోవర్స్ కి ఎలాంటి నష్టం జరగకూడదని, అలాగే వారిని తప్పుదోవ పట్టించకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటివి ప్రమోట్ చెయ్యలేదని తెలిపింది.
అయితే యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్ పేజీలు ఉన్నవారకి ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయని కానీ ఏది మంచిది, ఏది చెడ్డది అని తెలుసుకుని ప్రమోట్ చెయ్యాలని లేకపోతే మాత్రం చిక్కులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ శివ బాలాజీ దంపతులని అభినందిస్తున్నారు.