
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ‘కల్కి 2898 ఎ.డి.’తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దాని సీక్వెల్లో ఆమెకు చోటు లేకపోవడం పెద్ద షాక్‌గా మారింది. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న Spirit ప్రాజెక్ట్ నుండి కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెను తప్పించేశాడు.
అప్పట్లో “కథను లీక్ చేసింది, షూటింగ్ షెడ్యూల్స్‌కి కఠిన నిబంధనలు పెట్టింది” అని వంగా నిందలు మోపగా, చాలామంది ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డారు.
అయితే ఇప్పుడు ‘కల్కి’ సీక్వెల్ నుండి అశ్వినీదత్ స్వయంగా దీపికాను డ్రాప్ చేయడంతో, ఆమెపై విమర్శలు మరింత పెరిగాయి.
ఇలాంటి కాంట్రవర్శీల మధ్య, అందరి దృష్టి ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న భారీ సినిమా AA22XA6 మీద పడింది. ఈ మల్టీ-కోటి సై-ఫై యాక్షన్ డ్రామాలో దీపికా ఇప్పటికే కీలక సన్నివేశాల్లో పాల్గొనగా, మేకర్స్ ఆమె ఎంపికపై స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
కానీ తాజా ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే—దీపికా పాత్రను గణనీయంగా తగ్గించారట! “ఆమె ఆంక్షలు, కండిషన్లు మేకర్స్‌కు ఇబ్బంది కలిగించడంతో, పెద్దగా ఘర్షణలు రాకుండా పాత్రను కట్ చేసి, కేవలం ‘మమ అనిపించే’ రేంజ్లో ఉంచబోతున్నారు” అని వినిపిస్తోంది.
దాదాపు 800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణం సజావుగా సాగాలంటే మేకర్స్ ఎలాంటి సమస్యలు వద్దని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని గాసిప్ హడావిడి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
