అల్లు అర్జున్‌తో కంటే ముందు, మరో స్టార్ హీరోతో త్రివిక్రమ్ సినిమా రెడీ చేస్తున్నాడు. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. త్రివిక్రమ్ చేయబోయే కొత్త సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. షూటింగ్ త్వరలో మొదలవ్వనుందట. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.
త్రివిక్రమ్ ఈ సినిమాను విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నాడని లేటెస్ట్ బజ్. వెంకీతో త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో చాలాసార్లు సెట్ కావాలని ప్లాన్ చేసినా, అది వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్‌తో ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడంతో, వీరి కాంబో ఇప్పుడు డైరెక్టర్ హీరోగా ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్‌తో రాబోతుందని అంటున్నారు.
త్రివిక్రమ్ సినిమాలకు సంగీతం కీలకం. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడట. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు త్రివిక్రమ్ కథలకు ఎప్పుడూ కూడా ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్నాయి.
‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’ సినిమాల్లో వీరి కాంబో అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. ఇక గుంటూరు కారం సాంగ్స్ లో కొన్ని బాగానే హైలెట్ అయ్యాయి.