హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇప్పుడు తెలుగులోనూ ఫేమస్సే. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.

రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ఐశ్వర్య రాజేష్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఐశ్వర్య రాజేష్ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో నా ఫస్ట్ షూట్ అంటూ క్యూట్ ఫొటో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అప్పుడు భలే ఉన్నావుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/stories/aishwaryarajessh/3609894256914917908/?utm_source=ig_story_item_share&igsh=NTZqNmR0ZmNjN2lw

, , ,
You may also like
Latest Posts from