సినిమా వార్తలు

‘అఖండ 2’కి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ఫిక్స్… టికెట్ రేట్ ఎంత పెట్టారో తెలుసా?

ఈ డిసెంబర్‌లో టాలీవుడ్‌ను షేక్ చేయబోతున్న భారీ రిలీజ్‌ల్లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ‘అఖండ 2’ ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి శక్తివంతమైన విలన్ గా కనిపించబోతున్నారు. సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్.

పెయిడ్ ప్రీమియర్స్ కన్‌ఫర్మ్! – డిసెంబర్ 4న పలు సెంటర్లలో

నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన తాజా అప్డేట్ ఇది— డిసెంబర్ 4న దేశవ్యాప్తంగా అనేక సెంటర్లలో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ జరగనున్నాయి. అంటే బాలయ్య తాండవం మిగతా ప్రేక్షకుల కంటే 24 గంటల ముందే చూసే అవకాశం!

టికెట్ రేటెంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంపు కోసం కూడా ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇక పెయిడ్ ప్రీమియర్ షోల ధర… ఒక్కొ టికెట్ రూ. 600! మాస్ ఫ్యాన్స్, బాలయ్య అభిమానుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలకు 1000 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుడు ఆ రేట్లు చూసి ప్రీమియర్స్ వైపు చూడటానికే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు బాలయ్య ‘అఖండ 2’ టీమ్ మాత్రం ఆ ట్రెండ్ కు భిన్నంగా వెళ్తోంది.

Similar Posts