సినిమా వార్తలు

‘అఖండ 2’ బిజినెస్ తుఫాను! – తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ!!

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2 : తాండవం’ ట్రేడ్ సర్కిల్స్‌లో అఖండ స్థాయిలో బజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు, సీక్వెల్‌పై ఆడియెన్స్‌లో ఉన్న డివోషన్ + మాస్ హైప్ కారణంగా, ఈ సినిమా బిజినెస్ బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ లేని రేంజ్ లో క్లోజ్ అవుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏరియాల వారీగా బయటకు వస్తున్న వివరాలు ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి.
బాలయ్య – బోయపాటి మాస్ పవర్ నిజంగా ‘పాన్ ఇండియా స్టార్ రేంజ్’లో ఉందని నిరూపిస్తూ, అఖండ 2 బిజినెస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది!

‘అఖండ 2’ ఆంధ్ర ప్రాంత బిజినెస్ – ఏరియా వైస్ బ్రేక్‌డౌన్

ఆంధ్ర (6 ఏరియాలు) – మొత్తం బిజినెస్ సుమారు ₹50 కోట్లు!

ఉత్తరాంధ్ర – ₹13.50 Cr

గుంటూరు – ₹9.50 Cr

ఈస్ట్ గోదావరి – ₹8.25 Cr

కృష్ణా – ₹7 Cr

వెస్ట్ గోదావరి – ₹6.5 Cr

నెల్లూరు – ₹4.4 Cr

కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే ఈ స్థాయి రేట్లు రావడం బాలయ్య సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

సీడెడ్ బిజినెస్ – సీనియర్ హీరోలలో ఎన్నడూ లేని రికార్డ్!

సీడెడ్ ఇంటర్నల్ రేషియో సుమారు ₹24 కోట్లు, ఇది
బాలయ్య కెరీర్‌లో హయ్యెస్ట్,
సీనియర్ హీరోలలో ఆల్‌టైమ్ రికార్డ్,
టాలీవుడ్‌లో టాప్ 5 రేంజ్ రికార్డ్ బిజినెస్!

బోయపాటి & బాలయ్య కాంబినేషన్‌కి ఉన్న గ్రావిటీ ఏంటో ఈ సంఖ్యే చెబుతోంది.

ఆంధ్ర + తెలంగాణ = 100 కోట్ల క్లబ్ — బాలయ్యకి ఫస్ట్ టైమ్ హిస్టరీ!

మొత్తం ఆంధ్రప్రదేశ్ బిజినెస్: ₹75 Cr
నిజాం ఏరియా కోసం చర్చలు కొనసాగుతున్నాయి.

నైజాం కలుపుకునే సరికి,

తెలుగు రాష్ట్రాల్లో ‘అఖండ 2’ బిజినెస్ 100 కోట్ల మార్క్ దాటిపోతుంది!

ఇది బాలకృష్ణ కెరీర్‌లో మొట్టమొదటి 100 కోట్లు ప్రీ-బిజినెస్ సినిమా!

ఓవర్‌సీస్ + ROI‌తో కూడిన మొత్తం థియేట్రికల్ బిజినెస్:

సుమారు ₹125 కోట్ల దాకా!

ఇది బాలయ్య సినిమా మాత్రమే కాదు… “పాన్ ఇండియా మాస్ మార్కెట్‌లో బాలయ్య ఎంట్రీ” కి స్పష్టమైన సంకేతం.

Similar Posts