ఈ ఏడాది జనవరిలో విడుదలై సంచలన విజయం సాధించిన వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లోని “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లోకి దూసుకెళ్తోంది!

ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ – బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ తెలుగు బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో హీరోగా నటించబోతున్నారని . ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తెలుగు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన దిల్ రాజు.. హిందీలో రీమెక్ ను కూడా ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. గతంలో కూడా దిల్ రాజు తెలుగు సినిమాలైన జెర్సీ, హిట్ : దిఫస్ట్ కేస్ వంటి వాటిని హిందీలో నిర్మించారు. ఇప్పుడు తన సొంత బ్లాక్ బస్టర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు.

మరో వైపు ఈ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించే బాధ్యతలను బాలీవుడ్‌లో ‘వెల్‌కమ్’, ‘నో ఎంట్రీ’, ‘భూల్ భులయ్యా’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీకి అప్పగించినట్లు సమాచారం. అయితే తన కామెడీ టైమింగ్‌తో అనీస్ బాజ్మీ ఈ కథను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చే అవకాశం ఉంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది అనీస్ బజ్మీ, ప్రస్తుతం కథ, నటీనటులు, సాంకేతిక బృందం వివరాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

తెలుగు ప్రేక్షకుల నచ్చే పంచ్‌లు, హాస్యం, ఫ్యామిలీ ఎమోషన్‌లతో నిండిన ఈ సినిమా హిందీలోకి మారుతున్నప్పుడు — ఉత్తర భారతీయ ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా మార్పులు చేయబోతున్నారని సమాచారం.

సంక్రాంతి ఫెస్టివల్ నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్‌ వరకు — ఈ మూవీ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి!

, , , , ,
You may also like
Latest Posts from