తెలియకుండా మాట్లాడుతూ ఫ్లో లో నోరు జారితే గతంలో అయితే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ప్రతీది పెద్ద రాద్దాంతమై పోతోంది. రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ గా మారాయి. దిల్ రాజును స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. వారం రోజుల్లోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్ అన్నీ చూశాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ సినిమాను ఇలా.. ఓ సినిమాను అలా అంటూ గేమ్ ఛేంజర్ సినిమాపై సెటైర్లు వేశారని అల్లు అరవింద్ పై ట్రోలింగ్ జరిగింది.

ముఖ్యంగా మెగా అభిమానులు అల్లు అరవింద్ మాటలకు బాగా ఫీలయ్యారు. అసలే అల్లు అర్జున్ (Allu Arjun) వల్ల మండిపోయి ఉన్న మెగా అభిమానులని ఇవి మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది.

తాజాగా ఇదే విషయంపై మెగా నిర్మాత వివరణ ఇచ్చారు. “ఇటీవల దిల్ రాజుని (Dil Raju) అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని భావించి చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. దీనిపై నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. దిల్ రాజుని లైఫ్ గురించి చెప్పే క్రమంలో నేను అలా అనడం జరిగింది.దీంతో మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ తర్వాత నాకు కూడా అనిపించింది. అనవసరంగా అలా అనేశానే అని..!

దయచేసి ఆ విషయంలో నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. నేను కూడా అతనికున్న ఏకైక మేనమామ. మా మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఇంతకు మించి ఏం మాట్లాడినా.. దీనిపై ఇంకా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు. అని వివరణ ఇచ్చారు అల్లు అరవింద్.

ఈరోజు ‘తండేల్’ పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అల్లు అరవింద్..తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు.

, , ,
You may also like
Latest Posts from