టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కేరళలో ఒక ఫినామెనాన్. పుష్ప 2 తర్వాత, ప్రతి ఫ్యాన్స్ అతన్ని చూసి మురిసిపోతున్నారు. నిజంగా, బన్ని అక్కడ ఫ్యాన్ లవ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. అందుకు తగ్గట్లే కేరళలలో తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలాగే అక్కడ వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయ , సహకారాలు చేస్తున్నారు. అలా అల్లు అర్జున్ ..అక్కడ కేరళ వారి జీవితాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ క్రమంలో ఈసారి అల్లు అర్జున్ ఓనమ్ శుభాకాంక్షలతో ట్వీట్ చేసినపుడు కొంత మంది షాక్ అయ్యారు.
ఎందుకంటే… అతను తనను తానె ‘కేరళ దత్త పుత్రుడు’ గా పేర్కొన్నాడు!
కొన్ని ఫ్యాన్స్ దీన్ని ప్రేమగా తీసుకుంటే, మరికొందరు “తాను తానే ఇలా చెప్పుకోవడం అసలు బాగోలేదు” అని అంటున్నారు.
ఈ ట్వీట్‌తో అల్లు అర్జున్ మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు.
అల్లు అర్జున్ కొత్త చిత్రం విషయానికి వస్తే..
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ‘AA 22’ (వర్కింగ్ టైటిల్)గా ఇది ప్రచారంలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ రోల్‌కు సంబంధించిన కొన్నిరోజులుగా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని మొదట్లో ప్రచారం జరిగింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సినీ ప్రియులను ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ మేరకు తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన స్క్రీన్‌పై సందడి చేయనున్నారని టాక్. అట్లీ ఐడియాకు ఫిదా అయిన బన్నీ సైతం ఆయా లుక్స్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.