ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌లో 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ (OTT)అవుతోంది. రీలోడెడ్ వెర్షన్‌కు మరో నాలుగు నిమిషాలు జత చేసిన మొత్తం 3.44 గంటల నిడివితో విడుదలైంది.
తాజాగా బన్నీ సోదరుడు అల్లు శిరీశ్ (Allu Sirish) ఈ సినిమాను చూసారు. థియేట్రికల్ వెర్షన్‌లో మిస్ అయిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయని, రీలోడెడ్ వెర్షన్ నచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు.
క్లైమాక్స్ సీన్‌లో పుష్పరాజ్ (Allu Arjun)ను తన సోదరులు ఆలింగనం చేసుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘పుష్ప 2’.. రీలోడెడ్ వెర్షన్ చూస్తుంటే హై ఫీల్ వస్తోంది. సినిమా పూర్తయ్యేసరికి కన్నీళ్లు వచ్చేశాయి. థియేట్రికల్ వెర్షన్‌లో మిస్ అయిన లింక్స్ అన్నీ ఈ రీలోడెడ్ వెర్షన్‌లో కవర్ చేశారు’’ అని రాసుకొచ్చారు.
‘పుష్ప పార్ట్ 1కు సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్’ సిద్థమైంది. డిసెంబర్ 5న విడుదలైన సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. సంక్రాంతి తర్వాత అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలు జత చేసి ‘పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్’ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
‘పుష్ప 2’ సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఓటీటీలో విడుదల సందర్భంగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ మరో నాలుగు నిమిషాల నిడివి పెంచారు, దీంతో ఈ సినిమా ఓటీటీలో 3.44 గంటల నిడివితో అందుబాటులో ఉంది.