అల్లు కుటుంబం నుంచి వచ్చి హీరోగా అడుగుపెట్టిన శిరీష్‌కి ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ కొట్టలేదు. ఆయన సినీ ప్రయాణం అంత సాఫీగా సాగటం లేదు. ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’… ఇలా ఎనిమిది సినిమాలు చేసినా, ఒక్కదాన్ని కూడా ష్యూర్‌షాట్ హిట్‌గా చెప్పుకోలేని స్థితి. ఎంతో మంది హీరోలకు హిట్లు ఇచ్చి, వారి కెరీర్‌ను మలుపుతిప్పిన అల్లు అరవింద్ కూడా, తనయుడు శిరీష్‌ను సక్సెస్ పట్టాలు ఎక్కించలేకపోతున్నారు. గడచిన ఏడాది వచ్చిన బడ్డీ కూడా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శిరీష్‌కి ఓ హిట్ చాలా అవసరమైన దశ.
ఇలాంటి పరిస్థితుల్లోనే, కొత్త కథను శిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వరుస ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత, ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ ప్లే చేయాలని నిర్ణయించుకున్నాడట. యాక్షన్ జానర్‌కు దూరంగా, పూర్తిగా ఫన్ & ఎంటర్టైన్మెంట్‌తో నిండిన ఒక స్క్రిప్ట్‌కి ఓకే చెప్పాడని ఇండస్ట్రీ టాక్.
ఈ సినిమాకు ‘బచ్చలమల్లి’ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఆయన మొదట ‘సోలో బ్రతుకే సో బెటరు’తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘బచ్చలమల్లి’ చేశాడు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫలించలేదు. ఇప్పుడు మాత్రం మంచి కామెడీ టచ్‌తో ఉన్న స్క్రిప్ట్ రెడీ చేశాడని, ఇది మినిమమ్ గ్యారెంటీ అనిపించేలా ఉందని చెప్పుకుంటున్నారు. ‘సామజవరగమన’ తరహా వైబ్‌తో కథ ముందుకు సాగేలా ప్లాన్ చేశారని, రైటింగ్ టీమ్ కూడా బలంగా ఉన్నందున ఫన్ వర్కౌట్ అయితే హిట్టు ఖాయం అని టాక్ వినిపిస్తోంది.
ఈ నమ్మకంతోనే శిరీష్ స్క్రిప్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.