పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా విజయ్‌ దేవరకొండ (Vijay deverakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’ (Liger). 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు చెందిన అప్పులు ఇప్పటికీ పూరి ఇబ్బందిపెడుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయిటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనన్యా పాండే గురించి ఆమె తండ్రి ఇన్నాళ్లకు మాట్లాడారు..

లైగర్ చిత్రాన్ని ఉద్దేశించి అనన్య తండ్రి చంకీ పాండే తాజాగా కీలక కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో యాక్ట్‌ చేయడం అనన్యకు ఏమాత్రం ఇష్టం లేదని, కాకపోతే తన వల్లే ఆమె ఇందులో నటించిందని అన్నారు.

‘అనన్యకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు తను ఎంతో అసౌకర్యంగా ఫీలైంది. గందరగోళానికి గురైంది. హీరోయిన్‌ పాత్రకు సెట్‌ కానని.. చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. దాంతో నా వద్దకు వచ్చింది.

‘‘నాన్నా.. ఈ సినిమాకు నేను సెట్‌ కాననిపిస్తుంది. ఏం చేయమంటావు?’’ అని అడిగింది. అలా ఏమీ కాదని.. అదొక బిగ్‌ ప్రాజెక్ట్‌ కనుక సక్సెస్‌ అయితే పేరు వస్తుందని చెప్పి ఆమెను ఒప్పించాను. సినిమా విడుదలయ్యాక వచ్చిన విశ్లేషణలు చూసి.. తను చెప్పింది నిజమేననిపించింది. నిజంగానే ఆ పాత్రకు అనన్య చాలా చిన్నగా అనిపించింది.

ఆ సినిమా తర్వాత నేను తనకు ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. ప్రాజెక్ట్‌ల విషయంలో పూర్తి నిర్ణయం తనపైనే ఉంచాను. ప్రస్తుతం తనకు నచ్చిన ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతుంది’’ అని చంకీ పాండే తెలిపారు.

అనన్య మాట్లాడుతూ… ‘‘నిర్మాత కరణ్‌జోహార్‌, నా తల్లిదండ్రులు చెప్పడం వల్లే ‘లైగర్‌’ను ఓకే చేశాను. సాధారణంగా నా సినిమా రిలీజైన ప్రతిసారీ మా అమ్మ తన అభిప్రాయాన్ని చెబుతుంటారు.

లైగర్‌కు జస్ట్‌ ‘ఫన్‌!’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. నాకు వచ్చిన చెత్త రివ్యూ అదేననిపించింది. తప్పులు ప్రతిఒక్కరూ చేస్తారు. ఆ తప్పుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అర్థమైంది’’ అని అనన్య అన్నారు.

, , , ,
You may also like
Latest Posts from