కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మ్యాక్స్’ ఓటిటి రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించారు. సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రూపొందింది.
‘మ్యాక్స్’ మూవీ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్ . అలాగే ఈ మూవీ ఫిబ్రవరి 22,2025 లో ఓటీటిలోకి రాబోతుందని అంటున్నారు.
‘మ్యాక్స్’ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ దక్కింది.
‘మ్యాక్స్’ మూవీ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మించారు. ఈ సినిమాలో సంయుక్త, సుకృత, సునీల్, అచ్యుత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.