దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన చిత్రంలో ఉన్న హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆయన ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ పాడ్క్యాస్ట్లో పాల్గొన్న సందీప్ తన ఎక్సపీరియన్స్ ని పంచుకున్నారు.
‘యానిమల్’ సినిమాపై వచ్చిన విమర్శలకు మీరెమంటారు? అని అడగ్గా సందీప్ స్పందిస్తూ.. ‘‘గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఓ సీరియస్ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ లాంటి సినిమా తీయకూడదు. ఆ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కితీసుకెళ్లింది అన్నారు. ఆయన అలా అనడం నన్ను బాధించింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే నేనేదో నేరం చేసినట్లు అనిపించింది.
ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్షలు చేశారనిపించింది. చాలా కోపం వచ్చింది. కానీ.. అప్పుడు నేను ఒక్కటే అనుకున్నా.. దిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకుని ఓ రెండేళ్లు, మూడేళ్లు కష్టపడితే ఐఏఎస్ కావొచ్చు. వాటికోసం పుస్తకాలు కూడా ఉంటాయి. కానీ ఓ ఫిల్మ్ మేకర్.. రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. సొంతంగా నేర్చుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.