సినిమా వార్తలు

అమెరికాలో ‘MSG’ ప్రభంజనం.. ఫిగర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా, అప్పుడే నార్త్ అమెరికాలో తన సత్తా చాటుతోంది.

రికార్డు స్థాయిలో ప్రీ-సేల్స్!

విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే, ఈ సినిమా ప్రీ-సేల్స్ ద్వారా అర మిలియన్ డాలర్ల ($500,000) మార్కును దాటేసింది. చిరంజీవి కెరీర్‌లోనే ఇంత తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకున్న ఫాస్టెస్ట్ మూవీగా ‘MSG’ చరిత్ర సృష్టించింది. ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్ల ద్వారానే 1 మిలియన్ డాలర్ల మార్కును సులువుగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అనిల్ రావిపూడి మ్యాజిక్.. వెంకీ యాడింగ్!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు మెగాస్టార్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ హిట్ కొట్టిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్‌తో అంతకు మించి వినోదాన్ని పంచుతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించే దిశగా దూసుకుపోతోంది.

Similar Posts