కింగ్ నాగార్జున తన 100వ సినిమాను ఇటీవలే ప్రారంభించారు. తాత్కాలికంగా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌తో షూట్ నిశ్శబ్దంగా మొదలైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావడం లేదు.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్ టబు ప్రధాన పాత్రలో చేరి షూట్‌లో పాల్గొన్నట్టు సమాచారం. తాజాగా లేటెస్ట్ టాక్ ఏమిటంటే — మరో కీలక పాత్ర కోసం అనుష్క షెట్టిను సంప్రదించారట!

‘ఘాటీ’ తర్వాత కొత్త సినిమా సైన్ చేయని అనుష్క, నాగార్జున 100వ ఫిల్మ్‌తో రీ-ఎంట్రీ ఇవ్వబోతుందా అన్న కుతూహలం అభిమానుల్లో పీక్‌కి చేరింది.

ఇక నాగ్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నారని, టబు-అనుష్క ఇద్దరూ ఆయన్ను ఆ రెండు వేరువేరు పాత్రల్లో జతగా కనిపించనున్నారని బజ్‌.

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్ట్‌కి నిర్మాణ బాధ్యతలు తీసుకోగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ‘లాటరీ కింగ్’ 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

మరి, నాగ్ 100వ ఫిల్మ్‌లో అనుష్క ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందా? లేక ఇది మరో లక్కీ రూమర్‌నా?

, , , , ,
You may also like
Latest Posts from