ఘాటి సినిమా కోసం చాలా కష్టపడి నటించినా, ప్రమోషన్స్‌లో మాత్రం కనిపించలేదనే ఫ్యాన్స్‌లో కొంచెం డిజప్పాయింట్ ఉంది. కానీ అనుష్క అలా సైలెంట్ ఉండి, ఒక్ససారిగా సింపుల్‌గా ఒకే ఒక పోస్ట్‌తో అందరి దృష్టినీ తనవైపు లాక్కుని షాక్ ఇచ్చింది.
సినిమా ప్రమోషన్స్‌కు రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇంటర్వ్యూల్లో అసలేమాత్రం సంబంధం లేని ప్రశ్నలు, లుక్స్‌పై కామెంట్లు, గ్యాప్ గురించి రకరకాల క్వచ్చిన్స్ – ఇవన్నీ అనుష్కకు ఎప్పుడూ డిస్‌కంఫర్ట్ కలిగించేవే. అందుకే ఆమె క్లియర్‌గా “షూటింగ్ ఎంత కష్టమైనా చేస్తా కానీ ప్రమోషన్స్ మాత్రం నా వల్ల కాదూ” అని ఆఫ్ లైన్‌లోనే ఉంటోంది.
కానీ, ఈసారి ఘాటీ రిలీజ్ అవుతున్న సమయంలో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ రూపొందించిన AI వీడియోను షేర్ చేస్తూ, “ఇది నన్ను మళ్లీ నవ్వేలా చేసింది” అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదే ఒక్క పోస్ట్ సరిపోతోందని చెప్పాలి – ఫ్యాన్స్‌కు ఎనర్జీ డబుల్ అయిపోయింది.
https://twitter.com/MsAnushkaShetty/status/1962119774739280171
అదికాక, రానాతో ఒక ప్రత్యేక ఆడియో చాట్ కూడా చేసింది. సినిమా గురించి చర్చిస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయింది. వీడియో కాదు, కేవలం ఆడియో అయినా కూడా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
డైరెక్టర్ క్రిష్ చెబుతున్నట్టు – “ఘాటీ కోసం అనుష్క నిజంగానే రిస్క్ తీసుకుంది. చాలా కష్టపడింది. ఆ హార్డ్ వర్క్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది.” విక్రం ప్రభు కూడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి.
లాంగ్ టైమ్ తర్వాత అనుష్క చేస్తోన్న ఫిమేల్-సెంట్రిక్ మూవీ కావడంతో, ఘాటి మీద బజ్ రెట్టింపైంది. ఇప్పుడు అనుష్క ఒక్క పోస్ట్, ఒక్క ఆడియో చాట్‌తోనే మొత్తం ప్రమోషన్ వర్క్‌అవుట్ అయ్యిందని చెప్పాలి. దట్ ఈజ్ అనుష్క!