బాలీవుడ్‌లో స్టార్ వారసుడిగా అరంగేట్రం చేసినా, ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకోవడం అంత సులువు కాదని స్పష్టం చేస్తున్నాడు అభిషేక్ బచ్చన్. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన హీరోగానే కాదు, ఒక నమ్మకమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే అసలైన సవాలంటూ తన అనుభవాల్ని పంచుకున్నాడు.

“ఫోన్‌లు వచ్చేవి… కానీ, హిట్ లేకపోతే వాళ్లే మరిచిపోయారు!” అంటూ కొందరు నిర్మాతల డబుల్ స్టాండర్డ్స్‌ గురించి ఎంతో బాధతో వివరించాడు అభిషేక్.

“ఒకప్పుడు నాకు అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతలే ఫోన్ చేసేవాళ్లు. కానీ నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్ అయిన తర్వాత… అదే వాళ్లు నా ఫోన్లు ఎత్తడం మానేశారు. తిరిగి కాల్ చేయడం కూడా మర్చిపోయారు. ఇది నా వ్యక్తిగత బాధ కాదు… ఇది ఇండస్ట్రీ యొక్క అసలైన బిజినెస్ మోడల్!” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

బంధుప్రీతిపై అసలు మాట:

“అవును, నేను ఒక స్టార్‌ కుమారుడినే. కానీ, అదే నా ప్రయాణాన్ని సులభతరం చేసింది అనుకోవడం మూర్ఖత్వం. ఇండస్ట్రీలో నాకు తెలిసిన చాలా మంది ప్రముఖ నటుల పిల్లలు – వాళ్లకు సరైన గుర్తింపు రాలేదు. ఎందుకంటే, బాక్సాఫీస్‌ విజయాలే ఇక్కడ కొలమానం” అంటూ అభిషేక్ చెప్పిన మాటలు గమనించాల్సినవే.

“అవకాశం వస్తుంది అంటే… దానికి అర్హత ఉండాలి!” అని ఆయన వ్యాఖ్యానించాడు. “నిజంగా మీరు కమర్షియల్‌గా విలువ ఉన్నవారైతే… వారు మిమ్మల్ని మర్చిపోరు. కచ్చితంగా పిలుస్తారు. ఇది ఆట కాదు, వ్యాపారం!” అని అభిషేక్ స్పష్టం చేశాడు.

,
You may also like
Latest Posts from