సీడెడ్ నిస్సందేహంగా బాలకృష్ణ యొక్క స్ట్రాంగ్ ఏరిా. అక్కడ ఆయన మాస్ సినిమాలు ఎప్పుడూ అదిరిపోయే బిజినెస్ చేస్తూంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి. అఖండ నుండి భగవంత్ కేసరి వరకు, బాలయ్య ఇటీవలి చిత్రాలన్నీ ఈ ప్రాంతంలో దాదాపు రూ. 15 కోట్ల షేర్ వసూలు చేశాయి.

అయితే ఆశ్చర్యకరంగా, పాజిటివ్ మౌత్ టాక్‌తో మొదలైన అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రం డాకు మహారాజ్ ఆశించిన స్థాయిలో ఆడటంలేదు.

అదనపు టిక్కెట్ ధరలు . పాజిటివ్ టాక్ దృష్ట్యా, సీడెడ్‌లో బాలకృష్ణకు ఈ చిత్రం అతిపెద్ద చిత్రంగా మారవచ్చు అనుకుంటే అదే జరగటం లేదు. 12 కోట్ల షేర్ దగ్గర ఆగిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra)డైరక్టర్. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఎలాగైనా ఈ సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టాలనే కసితో తీసిన సినిమా ఇది.

ఎర్లీ మార్నింగ్ షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రావడంతో డౌన్ అయ్యిందనే చెప్పాలి.

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.

, , , ,
You may also like
Latest Posts from