బాలయ్యకు పోలీస్ యూనిఫాం వేస్తే ఆ కిక్కే వేరు. ఆ పాత్రను ఆయన ఒక ప్రత్యేకమైన స్టైల్ తో చేస్తారు. అలాగే బాలయ్య డైలాగ్ డెలివరీ, యాక్షన్ టెంపర్‌మెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ పోలీస్ పాత్రకు పర్‌ఫెక్ట్ మాచ్. కానీ, ఆ లుక్‌లో బాలయ్యను చూసి చాలా ఏళ్లు అయ్యింది. ఇక ఇప్పుడు… ఆ మాస్ మేజిక్ మళ్లీ తెరపై కనిపించబోతోంది!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ లో నందమూరి బాలకృష్ణ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ – బాలయ్యకు ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశారట. ఇది ఓ గెస్ట్ రోల్ కాదట, కథలో ఓ కీలక పాత్ర. యాక్షన్‌లో, డైలాగ్స్‌లో బాలయ్య ఫైర్ మళ్లీ చూడబోతున్నాం!
జైలర్’ సినిమాలో బాలకృష్ణతో ఒక అతిథి పాత్ర చేయించాలని అనుకున్నా కుదరలేదని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు సీక్వెల్ వచ్చే సరికి బాలయ్య రోల్ కన్ఫర్మ్ అయింది. ‘జైలర్ 2’లో బాలకృష్ణ సన్నివేశాలకు అనిరుద్ ఎటువంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొడతాడోనని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఎటువంటి సన్నివేశాలు రాశారోననే ఆసక్తి కూడా ఉంది.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ బ్లాస్టర్‌కి, మ్యూజిక్ మ్యాస్ట్రో అనిరుధ్ మళ్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా కంఫెషన్ రైజ్ చేయనున్నాడు.
‘జైలర్ 2’ సమ్మర్ 2026లో థియేటర్లలో భారీగా రిలీజవ్వనుంది!