టాలీవుడ్‌లో హీరోగానే కాకుండా, ప్రజాప్రతినిధిగా, మానవతావాదిగా కూడా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బాలయ్యకు అభిమానులు ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తూంటారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడే ఆయన మనసు మరోసారి ప్రజల్లో ప్రశంసలు పొందుతోంది.

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన బాలయ్య అభిమాని బద్రిస్వామి గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులు సూచించిన చికిత్సకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని తేలింది. కానీ ఆర్థిక స్థోమతలేని అతని కుటుంబానికి ఈ మొత్తం అంతకంతకూ భారంగా మారింది. దీంతో, పట్టణ బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు.

తక్షణమే స్పందించిన బాలయ్య, ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకొని రూ.10 లక్షల ఎల్.ఓ.సీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ సహాయాన్ని బాలయ్య సతీమణి వసుంధర స్వయంగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ మానవతా స్పూర్తితో బాలయ్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఇటీవలే అఖండ 2 విషయానికి వస్తే…నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇది. ఆ చిత్రం విజయవంతమైన ‘అఖండ’కి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ పేరుతో రూపొందుతోంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

ఇందులో బాలకృష్ణ సరసన సంయుక్తా మేనన్‌ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ సాగుతోంది. వారం రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, సంతోశ్‌ డిటాకే, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్, కూర్పు: తమ్మిరాజు.

, , , ,
You may also like
Latest Posts from