
బండ్ల గణేష్ రీఎంట్రీపై ఇండస్ట్రీ షాక్! ఏ హీరోతో సినిమా చేస్తున్నాడంటే…
టాలీవుడ్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలై, స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగానూ, నిర్మాతగానూ రాణించిన ఆయన, స్టేజ్ మీదకు ఎక్కగానే వచ్చే “మాటల సునామీ”కి కూడా ఇండస్ట్రీ సాక్షి. ప్రేమించిన వారిని ఆకాశానికి ఎత్తేసినా… నచ్చనివారిపై ధైర్యంగా సెటైర్లు వేసినా — బండ్ల గణేష్ హాట్‌టాపిక్ అవడం ఖాయం.
ఇటీవల అల్లు అరవింద్, విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్లతో మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చేసిన ఆయన… ఇప్పుడు “బండ్ల రీఎంట్రీ” అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
₹2 కోట్ల గ్రాండ్ పార్టీ… రీఎంట్రీకి సిగ్నల్‌నా?
దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ డిబేట్. మెగాస్టార్ చిరంజీవి సహా హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు భారీగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఆయన దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారన్న టాక్ తిరుగుతోంది.
ఇదే ఆప్యాయత గాలిలో బండ్ల నిర్మాతగా మళ్లీ రంగంలోకి దిగబోతున్నారనే సందేహం మరింత బలపడింది.
“అది నా ఇన్‌స్టాగ్రామ్ కాదు!” – బండ్ల గణేష్ క్లారిటీ
సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్టులతో హాట్‌టాపిక్ అయ్యే గణేష్, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ విషయంలో స్పష్టత ఇచ్చారు.
“నా పేరుతో నడుస్తున్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు… త్వరలోనే ఒరిజినల్ అకౌంట్ ప్రకటిస్తాను. అని ట్విట్టర్‌లో స్క్రీన్‌షాట్ పెట్టడంతో, నెటిజన్లు “ఇన్‌స్టాలో ఎప్పుడు ధూమ్ చేస్తారు?” అంటూ కామెంట్లతో దాడి చేస్తున్నారు.
“బండ్ల గణేష్ సినిమాలు చేయకపోవడం ఇండస్ట్రీకి ప్రమాదం!” – SKN బాంబ్
ఒక తాజా ఈవెంట్‌లో నిర్మాత SKN చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్: “మేధావుల మౌనం దేశానికి ప్రమాదం… బండ్ల గణేష్ సినిమాలు నిర్మించకపోవడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రమాదం.” ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తోనే గణేష్ రీఎంట్రీపై హైప్ మళ్లీ పీక్‌కి వెళ్లింది.
విజయ్ దేవరకొండతో సినిమా ఎందుకు ఆగింది?
బండ్ల–విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్స్ అయ్యిందనీ, కానీ డేట్స్ ఇష్యూ వల్లే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. దీంతో ఇటీవల జరిగిన ‘కె ర్యాంప్’ ఈవెంట్‌లో గణేష్ విజయ్‌పై పరోక్షంగా సెటైర్లు వేసారన్న చర్చ కూడా బలం పుంజుకుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా బండ్ల సినిమా?
లోపలమాట ఏమిటంటే— కిరణ్ అబ్బవరం హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా ఫైనల్ అవుతుందట. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అయితే… బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ బ్లాస్ట్ ఇస్తారా?
టాలీవుడ్ మొత్తం ఇదే ప్రశ్న అడుగుతోంది!
మరిన్ని కన్ఫర్మేషన్స్ ఏ క్షణానైనా రావచ్చని ఇండస్ట్రీలో టాక్.
