‘బిగ్ బాస్’ సీజన్ 9 స్టార్ట్ ప్రారంభం అయ్యిపోయింది. హీరో నాగార్జున హోస్ట్‌గా గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభమైంది. ఈ సీజన్‌కి ప్రత్యేకంగా “Owners vs Tenants” అనే కొత్త థీమ్‌ను తీసుకువచ్చారు.
ఈ సారి షోలో రెండు ఇళ్లు ఏర్పాటు చేశారు – ఒకటి సెలబ్రిటీల కోసం, మరొకటి కామనర్స్ కోసం. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉన్నారు. అయితే ఈసారి.. ఆరుగురు సామాన్యులు హౌస్లో అడుగుపెట్టడం విశేషంగా చెప్తున్నారు.
‘అగ్నిపరీక్ష’లోని టాప్ 13 కంటెస్టెంట్స్లో ఆరుగురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి అవకాశం దక్కింది. ఏడుగురికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం చేజారింది. అయితే రాబోయో రోజుల్లో ఈ ఏడుగురిలో ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కల్యాణ్ పడాల, హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్), ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్.. ఈ ఆరుగురు కామనర్స్గా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తొమ్మిది మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్తో బిగ్ బాస్ హౌస్ అసలుసిసలు ఆటకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ జరిగిన సీజన్లు ఒక లెక్క.. ఈ సీజన్ ఒక లెక్క.. అని సెలక్షన్స్తోనే తేల్చేసారు.
సెలబ్రెటీ కేటగిరీలో రీతూ చౌదరి, ఇమానుయేల్, ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ఠి వర్మ, తనూజ పుట్టస్వామి.. ఈ తొమ్మిది మంది ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్:
- తనూజ పుట్టస్వామి
- రీతూ చౌదరి
- ఇమానుయేల్
- ఫ్లోరా సైనీ
- సంజనా గల్రానీ
- సుమన్ శెట్టి
- రాము రాథోడ్
- భరణి
- శ్రేష్ఠి వర్మ
- కల్యాణ్ పడాల
- హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్)
- ప్రియా శెట్టి
- శ్రీజ దమ్ము
- డెమన్ పవన్
- మర్యాద మనీష్