సినిమా వార్తలు

థియేటర్స్‌లో ఫెయిల్, ‘కాంత’… OTTలో సంచలనం సృష్టిస్తుందా? డేట్ ఫిక్స్!

థియేటర్స్‌లో పెద్ద కలెక్షన్ సాధించలేకపోయినా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కాంత’ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. భారీ సెట్స్, 1960 మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అద్భుత వాతావరణం, రాణా – దుల్కర్ లు కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్… కథ పరంగా సమస్యలు ఉండటంతో బాక్సాఫీస్‌లో రిజల్ట్ రాలేదు. ముఖ్యంగా లాంగ్ రన్‌టైమ్, రెండో హాఫ్‌లో కథ కుదుపులు.

కానీ… సినిమా క్రియేటివ్ ఎలిమెంట్స్, టెక్నికల్ క్వాలిటీని మరింత మంది ప్రేక్షకులు ఆస్వాదించాలని, మేకర్స్ ఇప్పుడు OTT పై నమ్మకం పెట్టుకున్నారు.

OTT డేట్ ఫిక్స్

Netflix అధికారికంగా ప్రకటించింది:

డిసెంబర్ 12 – ‘కాంత’ OTT ప్రీమియర్
తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్
కన్నడలో మాత్రం వేరే టైటిల్‌తో విడుదల

కథ ఏమిటి?

1960ల మద్రాస్ నేపథ్యంలో… సినిమా ప్రపంచంలో వెలుగొందుతున్న స్టార్, అతని మెంటర్, ఒక కొత్త హీరోయిన్… వారి మధ్య సంబంధాలు ఎలా మారుతాయి? అదే సమయంలో ఒక హత్య జరగడం అన్నీ తలకిందులు చేస్తుంది.

రాణా & దుల్కర్ ఇద్దరూ ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కూడా.

ఇప్పుడు సస్పెన్స్

థియేటర్స్‌లో ఫెయిలైనా… OTTలో కల్ట్ హిట్ అవుతుందా? సినిమాటిక్ ఆర్ట్, పీరియడ్ సెటప్, విజువల్స్… ఇప్పుడు మరింత మందిని ఆకట్టుకుంటాయా?

డిసెంబర్ 12నే సమాధానం!

Similar Posts