
గీతా ఆర్ట్స్‌కి సంవత్సరాలుగా వెన్నెముకలాగే ఉన్న బన్నీ వాస్, ఇప్పుడు తన స్వంత బ్యానర్ ‘Bunny Vas Works’ ద్వారా కొత్త జెండా ఎగురవేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్‌లో మొదటి చిత్రం ‘మిత్ర మండలి’, ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి వీకెండ్ అడ్వాంటేజ్‌ను ఫుల్‌గా వాడుకోవాలన్న ఉద్దేశంతో, బన్నీ వాస్ టీమ్ థియేటర్లలో ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్స్ బుధవారం రాత్రే ప్లాన్ చేసింది.
ఇది యాదృచ్ఛికం కాదు! ఇదే టెక్నిక్‌ను ఆయన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కోసం కూడా ఉపయోగించారు. ఆ ప్రీమియర్స్ నుంచి వచ్చిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆ సినిమాను సూపర్‌హిట్‌గా నిలిపింది. ఇప్పుడు అదే ఫార్ములాను ‘మిత్ర మండలి’ కోసం మళ్లీ రిపీట్ చేస్తున్నారు.
ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ప్రియదర్శి, నిహారిక NM, రఘు మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బెహరా, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బన్నీ వాస్, విజయేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే అదే వారం కిరణ్ అబ్బవరం ‘K-Ramp’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘Dude’ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.
ఈ హై వోల్టేజ్ రిలీజ్ వీకెండ్‌లో బన్నీ వాస్ స్ట్రాటజీ మళ్లీ మ్యాజిక్ చేస్తుందా?
‘మిత్ర మండలి’ – బన్నీ వాస్ టచ్ ఉన్నా, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి!
