ఛావా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ రికార్డుల మీద రికార్డులు బ్రద్దలు కొడుతోంది. ఛావా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ దాటి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” రికార్డ్ లు ప్రక్కకు నెట్టేస్తోంది. పుష్ప 2 హిందీ వెర్షన్ 11 రోజుల్లో 144.33 కోట్ల నెట్ వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి 148.61 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ఛావా కేవలం మహారాష్ట్రలో మొదటి 11 రోజుల్లోనే ఛావా సుమారు 186.05 కోట్ల నెట్ వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఛావా కలెక్షన్లు పూర్తిగా మరాఠా ప్రాంతం నుంచి రావడం గమనించదగ్గ విషయం. పుష్ప 2 వసూళ్లు హిందీ బెల్ట్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బలంగా వచ్చాయి. కానీ మహారాష్ట్రలో మాత్రమే ఛావా దూకుడు పుష్ప 2 కన్నా ఎక్కువగా ఉంది.
ఇక విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ కురిపిస్తోంది ఛావా శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ నటించగా, రాణిగా రష్మిక, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. విక్కీ కౌశల్ శంబాజిగా చూపించిన అద్భుతమైన అభినయం, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ప్రతి డైలాగ్ లోనూ, ప్రతి ఫైట్ సీన్ లోనూ మరాఠా గర్వం ఉట్టిపడుతోంది.
ఛావాలో నటించినందుకు విక్కీ కౌశల్ 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం, కాగా రాణి పాత్రలో నటించిన రష్మిక మందన్నకు 4 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయి 11 రోజులు కాగా ఇంకా హౌస్ ఫుల్ గా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోండటం హైలైట్.