శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’కు (Chhaava) దేశవ్యాప్తంగా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అంతటా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)అద్బుతంగా చేసారు. ఈ క్రమంలో ఈ సినిమా మరింత మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపునిచ్చాయి.

‘ఛావా’కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పన్ను మినహాయింపును ప్రకటించింది. నిన్న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు ఆదరణ దక్కాలని పేర్కొన్నారు.

అలాగే గోవాలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు కలిగించాలని వస్తున్న విజ్ఞప్తుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు.

‘‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సినిమాను చూడలేదు. చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు.

, ,
You may also like
Latest Posts from