విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఫిబ్రవరి 14న ఏ మాత్రం అంచనాలు లేకుండా ఛావా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

నార్త్‌ ఇండియాలో ఛావా సినిమా ఎన్నో రికార్డ్‌లను బ్రేక్ చేసింది. బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా భారీ వసూళ్లు రాబట్టిందని సమాచారం. ఇప్పటికే పలు రికార్డ్‌లను తన సొంతం చేసుకున్న ఛావా సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఏకంగా భారత పార్లమెంట్‌ భవనంలో ఛావా సినిమాను ప్రదర్శించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న సినిమాను పార్లమెంట్‌ ఆవరణలో స్క్రీనింగ్‌ చేయబోతున్నారు.

ఈ స్క్రీనింగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, చిత్ర యూనిట్‌ సభ్యులు హాజరు కానున్నారు.

, , ,
You may also like
Latest Posts from