ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ప్రతిష్టాత్మంగా భావించి ఎదురుచూసే బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్‌(BAFTA Film Awards) ప్ర‌క‌టన వచ్చింది. లండ‌న్‌లోని రాయ‌ల్ ఫెస్టివ‌ల్ హాల్‌లో ఈ యేటి బాఫ్టా వేడుక జ‌రిగింది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు ఔట్‌స్టాండింగ్ బ్రిటీష్ ఫిల్మ్ అవార్డును కాన్‌క్లేవ్ చిత్రం గెలుచుకున్న‌ది.

ఈ చిత్రం 12 అవార్డుల‌కు నామినేట్ కాగా, నాలుగు బాఫ్టా అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది. ఇక ద బ్రూట‌లిస్ట్ అనే మ‌రో చిత్రానికి కూడా నాలుగు బాఫ్టా అవార్డులు ద‌క్కాయి. ద బ్రూట‌లిస్ట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్రాడీ కార్బెట్‌, లీడింగ్ యాక్ట‌ర్ ఆడ్రియ‌న్ బ్రూడీకి ఉత్త‌మ అవార్దులు ద‌క్కాయి.

అలాగే ఇంగ్లీష్ భాషకు చెంద‌ని క్యాట‌గిరీలో ఎమిలియా పెరేజ్ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ద‌క్కింది. బెస్ట్ స‌పోర్టింగ్ న‌టి అవార్డును జో స‌ల్డానా గెలుచుకున్న‌ది. ఎ రియ‌ల్ పెయిన్ చిత్రంలో న‌టించి కీరియ‌న్ కుల్కిన్‌కు స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డు, అనోరా చిత్రంలో న‌టించిన మైకీ మాడిస‌న్‌కు లీడింగ్ న‌టి అవార్డు ద‌క్కింది

,
You may also like
Latest Posts from