ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ – ఆయన కొత్త సినిమా “The Raja Saab” కోసం ఫ్యాన్స్ పీక్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెష్ జోనర్ అన్నీ రెడీగా సెట్ అయ్యాయి. కానీ… ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది సెట్ కాంట్రవర్సీ!.
అసలు విషయం ఏమిటంటే – సినీ కార్మికుల సమ్మె సమయంలో, ఈ సినిమా నిర్మాత TG విశ్వప్రసాద్ ఫెడరేషన్ కు లీగల్ నోటీసు పంపారు. ఇప్పుడు ఆ నోటీసు వెనక్కి తీసుకున్నా… యూనియన్ పెద్దలు వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, యూనియన్ వాళ్లు.. వర్కర్స్‌కి “రాజా సాబ్ షూటింగ్‌కి పోవద్దు” అని వార్నింగ్ ఇచ్చారట. అంటే వర్కర్స్ Vs ప్రొడ్యూసర్ మధ్య ఫైట్ ఇప్పుడు ఓపెన్ వార్ లా మారింది.
మరో వైపు ప్రభాస్ గ్లోబల్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం “రిలీజ్ డేట్ చెప్పు” అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండగా, మరోవైపు సెట్ దగ్గర జరుగుతున్న ఈ డ్రామా అందరినీ షాక్‌లో పడేస్తోంది.
“The Raja Saab” కాంట్రవర్సీ ఇలాగే సాగితే… షూటింగ్ మళ్లీ స్టక్ అవుతుందా? లేక ప్రభాస్ – మారుతి కాంబో పవర్‌తో ఇష్యూలన్నీ క్లియర్ చేసి మామూలే బ్లాక్‌బస్టర్ ట్రాక్‌లోకి వస్తుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ డిబేట్.
మొత్తానికి, ఈ సినిమా హిట్టయితే మారుతి రేంజ్ ఇంకో లెవెల్‌కు వెళ్తాడన్నది పక్కా… కానీ ముందు ఈ వర్కర్స్ – ప్రొడ్యూసర్స్ వార్ ఎండింగ్ ఏంటో చూడాలి!