రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్‌లతో రూపొందుతున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన భారీ పాన్-ఇండియా మూవీ ‘కూలీ’ పై దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో హైప్ ఉంది. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే, సినిమాకి సంబంధించి ఈ అంచనాలకన్నా, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రజినీ vs నాగ్ ఫ్యాన్స్ వార్ ఎక్కువ హడావుడి చేస్తోంది.

“కూలీ బజ్ అంతా నాగార్జున వల్లే!”

కొద్ది రోజుల క్రితం నుంచి X (ట్విట్టర్)లో నాగార్జున ఫ్యాన్స్ “కూలీకి 1000 కోట్ల మార్కెట్ ఎందుకు వచ్చింది? కారణం నాగ్ స్టార్డమ్!” అని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి రజినీకాంత్ అభిమానులు తక్షణమే ప్రతిస్పందించారు. ” ఇది తలైవా సినిమా…!” అంటూ విరుచుకుపడ్డారు. ఇక్కడితో ఆగకుండా, మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

ఎడిటెడ్ పాస్‌లు… ఫైర్ చేసిన ఫ్యాన్స్!

ఇటీవల సోషల్ మీడియాలో కూలీ ఆడియో లాంచ్ పాస్‌ల ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో రజినీకాంత్ ప్రధానంగా ఉన్నప్పటికీ, కొంతమంది నాగార్జున అభిమానులు రజినీ ఫోటోను క్రాప్ చేసి, కేవలం నాగార్జున కనిపించేలా ఎడిట్ చేసి షేర్ చేస్తూ, “నాగ్ నిజమైన హీరో!” అంటూ ప్రచారం చేయడం వివాదాన్ని మరింత పెంచింది.

“నాగ్ స్టామినా అంతంటే, పాత సినిమాలు ఎందుకేడ్చాయి?”

ఈ ఆగడాలపై రజినీకాంత్ అభిమానులే కాదు, ఇతర నెటిజన్లు కూడా మండిపడ్డారు. “ఇటీవలి నాగార్జున సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.10 కోట్ల మార్కును దాటలేకపోయాయి. అలాంటిది 1000 కోట్లు అనటం ఎంతవరకు న్యాయం?” అంటూ మండిపడ్డారు. “ఇది రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ క్రేజే కాదు, మార్కెట్‌ను డిఫైన్ చేసే మ్యాజిక్” అని స్పష్టం చేస్తున్నారు.

సినిమా కంటే ఫ్యాన్ వార్ ఎక్కువా?

ఇప్పుడు ప్రశ్న ఇదే. ఈ సోషల్ మీడియా స్పాట్‌లైట్ సినిమాపై పడుతుందా? లేక వాదనలు, వేధింపులు, క్లిప్ వార్స్‌తో సినిమాకి ప్రతికూలత వస్తుందా? ఫ్యాన్ వార్ కంట్రోల్‌లోకి రాకపోతే, ‘కూలీ’ ప్రమోషన్ కంటే ఈ ఫైట్‌నే ఎక్కువగా చర్చించుకుంటే తప్పలేదు.

, , , ,
You may also like
Latest Posts from