నాని – శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘హిట్ 3’ లో భాగంగా విడుదలైన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ (HIT: The Third Case) ఈ ఏడాది మే 1న థియేటర్లలో విడుదలై భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో, ఈ సినిమా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసి, నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మూవీలో మితిమీరిన హింస ఉండిందన్న విమర్శలు వచ్చినప్పటికీ, సినిమా డిజిటల్లో వచ్చాక కూడా భారీగా వీక్షణలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రంపై కాపీ రైట్ వివాదం పుట్టుకొచ్చింది.
విమల్ సోనీ షాకింగ్ ఆరోపణలు
నాని కి వీరాభిమానిగా చెప్పే సోనియా విమల్ అనే రచయిత ఇటీవల హిట్ 3పై కాపీ ఆరోపణలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తాను రాసిన ‘ఏజెంట్ 11’ మరియు ‘ఏజెంట్ వీ’ కథలను కాపీ చేసి హిట్ 3 సినిమాగా తీశారని ఆమె ఆరోపించారు.
దాంతో పాటు, మద్రాస్ హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. ఈ కేసు విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.
సినీ వర్గాల్లో ఉత్కంఠ
ఒకవైపు సినిమా అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో, ఇలా ఒక అభిమాని రచయిత నుంచే కాపీ ఆరోపణలు రావడం చిత్రబృందాన్ని దుమారంలోకి నెట్టేసింది. మరి ఈ కేసు ఏ దిశగా వెళుతుంది? న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోనూ నెలకొంది.