
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కన్‌ఫర్మ్… కానీ హీరోయిన్ ఎవరు? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
సంగీతంతో దేశాన్ని ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 25 ఏళ్ల బ్లాక్‌బస్టర్ కెరీర్, నేషనల్ అవార్డ్ తర్వాత—ఇప్పుడు DSP హీరోగా ఎంటర్ అవుతున్న విషయం ఇండస్ట్రీలో భారీ హీట్ టాపిక్.
వేణు యెల్డండి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రూరల్ తెలంగాణ డ్రామా “ఎల్లమ్మ” లో DSP లీడ్ రోల్ చేస్తుండగా, ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ మొదట నితిన్, నాని పేర్లతో తిరిగింది. కానీ ఫైనల్‌గా ఆ పాత్ర DSP దగ్గరే ల్యాండ్ అయింది. అయిదే ఇప్పుడు దేవి ప్రక్కన చేయబోయే హీరోయిన్ ఎవరూ అనేదే మాసివ్ కన్‌ఫ్యూజన్!
మొదట కీర్తి సురేష్ ని పక్కాగా అనుకున్నారు. కానీ ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ—
“నేను ఎల్లమ్మలో లేను” అని క్లియర్‌గా చెప్పేసింది.
ఇప్పుడు కొత్తగా హంట్ స్టార్ట్!
ఇండస్ట్రీలో వినిపిస్తున్న హాట్ పేరు సాయి పల్లవి. అయితే ఆమె “రామాయణం”లాంటి భారీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయడంపై క్లారిటీ లేదు.
DSP హీరోగా చేసే సెన్సేషన్ డెబ్యూట్‌కి ఏ స్టార్ హీరోయిన్ జత కాబోతుంది?
ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లోని హాట్ మిస్టరీ!
