
‘పుష్ప’ ని అనుకరిస్తూ పృధ్వీ రాజ్ సినిమా, టాక్ ఏంటంటే..
పృధ్వీరాజ్ సుకుమారన్ కొత్త చిత్రం ‘విలయత్ బుద్ధ’ ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోవటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. L2 Empuraan ఫ్లాప్ తరువాత విడుదలైన ఈ సినిమా, స్టార్ పవర్ ఉన్నా కూడా పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు.
ప్రేక్షకులు చూసి బయటకు వస్తూనే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
“పృధ్వీరాజ్ నటన సూపర్… కానీ కథ బాగోలేదు”
“స్క్రీన్‌ప్లే డల్… ఎక్కడో ఫ్లాట్‌గా సాగింది”
అని కామెంట్లు చేస్తున్నారు.
Pushpa టోన్… అదే స్టైల్? అందుకే పని వర్కవుట్ కాలేదా?
చిత్రంలో ఉండే విజువల్స్, టోన్, స్టైల్—అల్లు అర్జున్ ..పుష్ప మూడ్‌నే గుర్తు చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. సచ్చీ నవల ఆధారంగా తీసిన కథ రెండు ఈగో ఉన్న ఇద్దరి మధ్య క్లాష్‌పై ఉంటుంది. కానీ ఇదే థీమ్‌పై పృధ్వీరాజ్ ఇప్పటికే క్లాసిక్స్ అయిన Driving Licence, Ayyappanum Koshiyum ఇచ్చిన కారణంగా, ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉండి… చివరికి డిసప్పాయింట్ అయ్యారని కామెంట్లు.
బాక్సాఫీస్‌లో మరో అవమానం?
అదే రోజున విడుదలైన కొత్త హీరో సందీప్ ప్రదీప్ సినిమా EKO బాక్సాఫీస్‌లో విలయత్ బుద్ధ కంటే బాగా నడుస్తోంది. సోషల్ మీడియా కూడా పృధ్వీరాజ్ పై విమర్శలు వర్షం కురిపిస్తోంది. “మలయాళ సినిమాలను పట్టించుకోకుండా పాన్ ఇండియా డ్రీమ్స్‌పై ఫోకస్ పెట్టేశాడు… ముఖ్యంగా రాజమౌళి ‘వరాణాసి’ కారణంగా” అని విమర్శలు వస్తున్నాయి.
తీరా చూస్తే… పెద్ద డిజాస్టర్?
ఇప్పటికే టాక్ తీవ్రంగా నెగటివ్. ట్రెండ్ ఇదే కొనసాగితే, విలయత్ బుద్ధ డిజాస్టర్‌గా మారే అవకాశాలు ఎక్కువ.
పృధ్వీరాజ్ కు ఇది పెద్ద హెచ్చరికలా మారుతుందా? Vilayath Buddha కనీసం బ్రేక్ ఈవెన్ అయినా చేరుకుంటుందా? లేక మరో పెద్ద ఫ్లాప్‌గా లెక్కలో పడిపోతుందా? రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ రన్ మొత్తం చెప్పేస్తుంది.
ఇంకా మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!
