“తెలుగులో టాలెంట్ ఉంది.. కానీ తలుపు తట్టి అవకాశం ఇచ్చేవాళ్లే లేరు!”
– ఇప్పుడు ఆ తలుపు తడుతున్నాడు దిల్ రాజు!
తెలుగులో టాలెంట్ కొరత లేదు. కానీ ఆ టాలెంట్‌ను గుర్తించేందుకు, ప్రోత్సహించేందుకు ఒక సరైన మార్గం లేక చాలా మంది యంగ్ క్రియేటివ్స్ మిగిలిపోతున్నారు. సినిమా చేయాలన్న తపన ఉంది… కాని ఎవరిని ఎలా అప్రోచ్ అవాలి? ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి? అనేది తెలియకనే ఎన్నో కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.
ఇలాంటి సమస్యలను గుర్తించిన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – ఇప్పుడు కొత్త టాలెంట్‌కు కుర్చీ వేస్తూ , “దిల్ రాజు డ్రీమ్స్” పేరుతో ఓ ప్రత్యేకమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేయబోతున్నారు.
జూన్ నుంచి ప్రారంభం కానున్న “దిల్ రాజు డ్రీమ్స్”
ఈ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ పోర్టల్ జూన్‌లో లైవ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్త కంటెంట్, కొత్త ఆలోచనలు, కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు పరిచయం చేయడం దిల్ రాజు లక్ష్యం.
సినిమాలపై ప్యాషన్ ఉన్న వారు, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు – ఎవరైనా https://dilrajudreams.com/ అనే లింక్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసిన తరువాత దిల్ రాజు టీమ్ స్వయంగా మీతో సంప్రదిస్తుంది.
ఇప్పటి వరకు టాలెంట్ ఉన్నా సరైన మార్గం తెలియక వేల మంది వెనక్కి తగ్గిపోయారు. ఇప్పుడు “దిల్ రాజు డ్రీమ్స్” వారికో గోల్డెన్ ఛాన్స్. టాలెంట్‌ను ప్రపంచానికి చూపించుకునే ఓ స్టేజ్. స్నేహితుల కెమెరా ముందు యాక్ట్ చేయడం, లేదా ఇంట్లో స్క్రిప్ట్ రాసుకున్నవాడు, ఇప్పుడు అదే డ్రీమ్‌ని రియాలిటీ చేయగలుతాడు.
గేమ్ ఛేంజర్ (ఫెయిల్యూర్ అయినా పెద్ద ప్రాజెక్ట్), సంక్రాంతికి వస్తున్నాం (సూపర్ హిట్) ఈ యేడు దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు రౌడీ జనార్ధన్ లాంటి క్రేజ్ ఉన్న సినిమా ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌పై రాబోతోంది.
అలాగే ఇటీవలే ఆయన సొంతంగా ఒక AI కంపెనీని కూడా ప్రారంభించారు. ఇప్పుడు “దిల్ రాజు డ్రీమ్స్” ద్వారా టాలెంట్‌ను టెక్నాలజీతో కలిపి, పరిశ్రమకు కొత్త గాలి తేవాలనుకుంటున్నారు.
సినిమా అంటే కలల సంకలనం. ఆ కలలకు ఓ మార్గం చూపాలన్న ఆశయంతోనే దిల్ రాజు ఈ ప్లాట్‌ఫామ్ తీసుకొస్తున్నారు. మీరు టాలెంట్‌తో రెడీ అయితే… దిల్ రాజు డ్రీమ్స్ తలుపులు మీ కోసం తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి!