సినిమా వార్తలు

దిల్ రాజు ‘అఖండ 2’ కోసం ఎంత రిస్క్ చేశాడో తెలిస్తే షాక్!

‘అఖండ 2’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 5న పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లకు రాబోతున్న ఈ చిత్రం తెలుగు సినిమా ప్రపంచంలో నెక్ట్స్ బిగ్ థింగ్‌గా తయారైంది. ఇప్పటికే అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుకాగా… ఒక్క నిజాం మాత్రమే పెండింగ్‌లో ఉంది.

అక్కడకే ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు!

‘అఖండ’ సమయంలో నిజాం రైట్స్ తీసుకుని భారీ లాభాలు అందుకున్న దిల్ రాజు… ఇప్పుడు ‘అఖండ 2’ నిజాం రైట్స్‌ను కూడా ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఇంతటితో ఆగలేదు—డిసెంబర్ 4 రాత్రే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్లతో చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేకాక, విడుదల మొదటి వారం టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సిద్ధమవుతోంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాస్ ఎనర్జీని రెట్టింపు చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ‘అఖండ 2’ ఓపెనింగ్ డే నుంచే సునామీ సృష్టించనున్నదన్న హైప్ భారీగా పెరుగుతోంది.

మరి… దిల్ రాజు పెట్టిన ఆ ‘ఫ్యాన్సీ ప్రైస్’ ఎంత? ఇండస్ట్రీ అంతా ఇదే టాక్!

Similar Posts