బాలీవుడ్ స్టార్స్ పరిస్దితి గత కొంతకాలంగా దారుణంగా మారింది. మాస్ లో ఎంతో క్రేజ్, ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ పరిస్దితి కూడా అలాగే ఉంది. గత కొన్నేళ్లుగా వరస పెట్టి ఎదురవుతున్న వరుస పరాజయాల నుంచి ‘సికందర్’ తో బయటపడతాడని అభిమానులు ఎదురుచూస్తే..పరిస్దితి ఇంకా దారుణంగా మారింది.

తమిళ సీనియర్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన చిత్రం.. సల్మాన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. తొలి రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆరో రోజైన శుక్రవారం ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. 90% కలెక్షన్స్ డ్రాప్ కనపడటం తో సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ ఇమేజ్ కే దెబ్బ పడింది. సోషల్ మీడియాలో సల్మాన్ ని మామూలుగా వేసుకోవటం లేదు.

ఇండియాలో ఈ సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ కేవలం 6 శాతం కావడం గమనార్హం. ఆదివారంతో థియేట్రికల్ రన్ ముగిసిపోయినట్లే. ఈ చిత్రానికి సల్మాన్ రూ.120 కోట్ల పారితోషకం తీసుకున్నాడట. థియేటర్ల నుంచి కనీసం తన రెమ్యూనరేషన్ కూడా రాలేదు. దారుణం కదా.

, ,
You may also like
Latest Posts from