సినిమా వార్తలుసోషల్ మీడియా

చిలకా అంటూ హద్దులు దాటాడు! డైరక్టర్ పై హీరోయిన్ ఫైర్

కోలీవుడ్ క్యూటీ దివ్యాభారతి (Divyabharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాచిలర్ సినిమా ఒక్కటే ఈ అమ్మడిని స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఇక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె… ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా చేస్తున్న GOAT మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదే ఆమె ఫస్ట్ తెలుగు ఫిల్మ్.

పాగల్ తో గుర్తింపు తెచ్చుకున్న నరేష్ కుప్పిలి ఈ సినిమాను మొదట దర్శకత్వం వహించాడు. సగం షూట్ అయ్యాక బడ్జెట్ ఇష్యూలతో నిర్మాతకు – దర్శకుడికి మధ్య గట్టి గ్యాప్ వచ్చింది. చివరికి నరేష్ ప్రాజెక్ట్ నుంచి క్లీన్‌గా తొలగిపోవడంతో… నిర్మాతే డైరెక్టర్‌గా మారి సినిమా పూర్తిచేశారు. ఇప్పుడు విడుదలకు రెడీ.
కానీ అసలు డ్రామా ఇప్పుడు మొదలైంది.

మేకర్స్ ప్రొమోను రిలీజ్ చేసిన వెంటనే దివ్యాభారతి ఒక్కసారిగా ఫైర్ అయింది. నరేష్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పాత పోస్ట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ అతడి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.

ఆ పోస్ట్‌లో దర్శకుడు ఇలా కామెంట్ చేశాడు:

‘ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు?.. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై..” అంటూపోస్ట్ పెట్టాడు.

ఈ మాటలే కాకుండా సెట్స్‌లో కూడా దివ్యాభారతిపై పదేపదే డిగ్రేడింగ్, డర్టీ కామెంట్స్ చేశాడని ఆమె బయటపెట్టింది.

దివ్యాభారతి ఇలా ఫైర్ అయ్యింది:

“స్త్రీలను ‘చిలకా’ అంటూ అవమానించడం జోక్ కాదు. ఇది లోతైన మహిళా ద్వేషం. సెట్స్‌లో కూడా మహిళలను గౌరవించేవాడు కాదు. తాను గర్వంగా చెప్పుకునే కళకు ద్రోహం చేశాడు. నన్ను ఇంకా బాధపెట్టింది హీరో సుధీర్ మౌనం. అలాంటి మౌనం ఇలాంటి కల్చర్‌ను ప్రోత్సహిస్తుంది.”

“నేను పనిచేసే చోట మర్యాద కావాలి. గౌరవం లేని వర్క్ ప్లేస్‌లో మౌనం కాదు — గట్టిగా మాట్లాడాల్సిందే.” అని ఆమె స్పష్టం చేసింది.
దాంతో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది — “దివ్యాభారతికి ప్రతీ టీంతో ఎందుకే ఇష్యూలు?” అని ట్రోల్స్ కామెంట్స్ చేశారు.
దానికి ఆమె కౌంటర్ బ్లంట్‌గా ఇచ్చింది:

“తమిళంలో అదే టీమ్‌తో ఎన్నో సినిమాలు చేశాను. ఒక్క సమస్య రాలేదు. ఈ ఒక్క దర్శకుడే హద్దులు దాటాడు. అతడే పబ్లిక్‌గా మాట్లాడాడు… అందుకే నేను కూడా పబ్లిక్‌గా రెస్పాండ్ అవుతున్నాను. నేను నిద్ర పోయే టైంలో ఏ మార్పూ లేదు. ఎవరు నన్ను చెడుగా మాట్లాడినా… వారికి నేను నిజంగానే శుభాకాంక్షలు చెబుతున్నాను.”

ఇప్పుడు ఈ మొత్తం విషయం సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ అయ్యింది.

డైరెక్టర్ నరేష్ స్పందిస్తాడా?
సుధీర్ ఏం అంటాడు?
ఇంకా ఎన్ని స్క్రీన్‌షాట్‌లు బయటకు రావోతాయి?

Similar Posts