పేరుకే మలయాళ హీరో… కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో స్ట్రెయిట్ తెలుగు హీరోలకే సవాల్ విసిరేలా క్రేజ్ సంపాదించాడు. అదే ఫాలోఅప్‌గా రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందుతున్న ‘కాంత’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు దుల్కర్. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘మహానటి’లో జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్, ఈసారి ‘కాంత’లో 1960లలోని ఓ స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ చూస్తే – సముద్రఖని ఒక దర్శకుడిగా, దుల్కర్ హీరోగా – ఇద్దరూ కెరీర్ స్టార్ట్‌లో మంచి స్నేహితులుగా కనిపిస్తారు. కానీ మధ్యలో ఏదో గొడవ వల్ల దారి దారి విడతారు. తర్వాత సముద్రఖని రూపొందించే హారర్ మూవీ ‘శాంత’ లో హీరోగా దుల్కర్, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తారు. అయితే ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ఏం జరిగిందనేది అసలు కథలా అనిపిస్తుంది.
టీజర్ టోన్ చూస్తే ఇది రెగ్యులర్ ఫార్ములా సినిమాలు కాదనిపిస్తుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో, ఇంటెన్స్ న్యారేషన్‌తో మన ముందుకొస్తుందన్న ఫీల్ కలిగిస్తుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దుల్కర్ అభిమానులకు ఇది మరో బిగ్ హిట్ కావడం ఖాయం అనే ఫీల్ టీజర్‌తోనే ఏర్పడుతోంది.