వారాహి చలన చిత్రం బ్యానర్ పై, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న “జూనియర్” సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. గాలి జనార్దన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 18న పాన్ ఇండియా రిలీజ్ కావనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీద బజ్ పెరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా విడుదలైన టీజర్ కిరీటిపై హైప్‌ను మరింత పెంచింది. ఫ్రెండ్‌షిప్ కోసం ఆఫర్ లెటర్ పంపే సీన్‌తో టీజర్‌కి స్టార్ట్ ఇచ్చారు. ఆ వెంటనే కిరీటి పవర్‌ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. స్టూడెంట్ గానూ, ఎంప్లాయ్ గానూ కనిపించిన ఆయన రెండు గెటప్పుల్లోనూ ఆకట్టుకున్నారు. “ఎవరైనా పైకి వెళ్తే చాలు.. లాగేయడానికి వస్తారు” అన్న డైలాగ్ ఇంటెన్స్ గా ఉంది.

శ్రీలీలతో కిరీటి కెమిస్ట్రీ క్యూట్‌గా, ఫన్నీగా ఉండగా, చివర్లో జెనీలియా గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. టీజర్‌లో కథను స్పష్టం చేయకుండా కానీ, క్యారెక్టర్స్‌ను హైలైట్ చేస్తూ కట్ చేసిన తీరు ఆసక్తిని పెంచేలా ఉంది. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసిన విధానం కిరీటీ నటనలో కనబడింది. డెబ్యూ హీరో అయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ విశ్వాసం కలిగిస్తోంది.

దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి విజన్, దేవిశ్రీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్‌ని గ్రిప్పింగ్‌గా మార్చాయి. మొత్తంగా చెప్పాలంటే, “జూనియర్” టీజర్ కిరీటి కోసమే డిజైన్ చేసినట్టే కనిపిస్తోంది. టీజర్ చూస్తే, గాలి జనార్దన రెడ్డి కొడుకు వెండితెర ఎంట్రీకి మంచి స్టార్ట్ దక్కినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి – జూలై 18 వరకు వేచి చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from