మళయాల నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘ఎల్‌2-ఎంపురాన్‌’ సినిమా నిర్మాతల్లో ఒకరైన గోపాలన్‌ తన సంస్థ ద్వారా రూ.1000 కోట్ల అనధికార నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంస్థపై వచ్చిన ఆరోపణలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కేరళ వ్యాపారవేత్త గోకులం గోపాలన్‌కు చెందిన గోకులం ఫైనాన్స్‌ సంస్థ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. తమిళనాడులోని చెన్నై, కేరళలోని కొచ్చితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

మరో ప్రక్క మలయాళ స్టార్లు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ఎల్2 ఎంపురాన్ వివాదం పార్లమెంట్ కు చేరింది. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ ఈ సినిమాకు 24 కట్స్ చేయడంపై గురువారం (ఏప్రిల్ 3) పార్లమెంట్ లో స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యసభలో గురువారం ఎంపీ జాన్ బ్రిటాస్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై మాట్లాడారు. ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను చూపించినందుకే రాజకీయ ఒత్తిడి పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సమాధానమిచ్చారు. “అసలు వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో ఒకే నిజం ఉంది. దీనిని భారతీయులందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎంపురాన్ ప్రొడ్యూసర్లపై ఎలాంటి సెన్సార్ ఒత్తిళ్లు లేవు” అని స్పష్టం చేశారు.

ఇక సినిమా థ్యాంక్యూ కార్డు నుంచి తన పేరును తాను కోరడం వల్లే తొలగించారని కూడా ఈ సందర్భంగా సురేష్ గోపీ చెప్పారు. “సినిమా మొదట్లో వేసిన థ్యాంక్యూ కార్డులో నుంచి నా పేరును డిలీట్ చేయాల్సిందిగే నేను ఫోన్ చేసిన నిర్మాతలను కోరాను. ఇదే నిజం. ఒకవేళ ఇది అబద్ధమైతే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. సినిమాలో నుంచి 17 సీన్లను డిలీట్ చేయాలన్నది ప్రొడ్యూసర్లు, లీడ్ యాక్టర్, డైరెక్టర్ నిర్ణయం” అని సురేష్ గోపీ చెప్పారు.

, , , ,
You may also like
Latest Posts from