ఫహాద్‌ ఫాజిల్ అంటే కేవలం హీరోగా కాకుండా, ఆర్టిస్ట్‌గా ఎంత గొప్పవాడో ప్రపంచం గుర్తించింది. అద్భుతమైన నటన, లోతైన ఎమోషన్స్, సరిగ్గా క్యారెక్టర్‌లోకి మునిగే దానితో ఫహాద్‌ ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించి, అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన తెలుగువారికి బాగా పరిచయం అయ్యాడు. ఓటిటిలో వచ్చే డబ్బింగ్ సినిమాలు కూడా ఆయనలోని నటుడుని మనకు పరిచయం చేసాయి. ఆయన నటనను హాలీవుడ్ కూడా గుర్తించింది. ఆహ్వానించింది. అప్పుడేమైందో చూద్దాం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫహాద్‌ తన కెరీర్‌లో చోటుచేసుకున్న ఓ అసాధారణ విషయాన్ని పంచుకున్నారు. హాలీవుడ్‌లో “ది రెవెనెంట్”, “బర్డ్‌ మ్యాన్” లాంటి ఫేమస్‌ డైరెక్టర్ అలెజాండ్రో గొంజాలెజ్‌ ఇనారిటోతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. కానీ… అతను ఆ అవకాశాన్ని వదులుకున్నారు!

అందుకు కారణం ఆయన చెప్పినట్లుగా యాస, భాష. ఇంగ్లీష్‌లో డైలాగ్స్‌ చెప్పాలంటే అమెరికాలో నాలుగు నెలలు ఉండి, భాషా పట్టు సాధించాల్సి ఉంది. ఆ సమయంలో ఎటువంటి జీతం కూడా ఉండదు. ఫహాద్‌ straight forward గా చెప్పాడు:

“నా జీవితంలో ఏదైనా కొత్త మార్పు కావాలంటే, కేవలం నా యాసను మార్చడం కోసం అంత శ్రమ చేయడానికి నేను సిద్ధంగా లేను. మలయాళ చిత్రసీమ నాకు ఇంతకింత ఇచ్చింది.” అని.

ఫహాద్‌ ఫాజిల్ నిజంగా ఆర్టిస్ట్‌గా ఉన్న ప్రతిభ, వృత్తిపరమైన అంకితభావం, తన సినిమాల పట్ల ప్రేమ, ప్రేక్షకులను ఎప్పుడు పిలిచే సామర్థ్యం – ఇవన్నీ ఈ నిర్ణయం ద్వారా స్పష్టమయ్యాయి.

, ,
You may also like
Latest Posts from